గత ఎన్నికల ముందు చాలామంది నాయకులు జగన్ వేవ్‌ని చూసి వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వస్తారని భావించి టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. కనీసం సీటు దక్కకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే ఏదొక పదవి దక్కుతుందిలే అని చెప్పి చాలామంది నేతలు ఫ్యాన్ పార్టీలోకి వచ్చారు. అయితే ఇప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది.