గత కొన్నిరోజులుగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో అశోక్ గజపతి రాజు, వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా అశోక్ బాధ్యతలు తీసుకోవాలని చెబుతూ, సంచయితని ఛైర్మన్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో ట్రస్ట్ ఛైర్మన్గా అశోక్ తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. కానీ దీనిపై మళ్ళీ కోర్టుకెళ్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అలాగే అశోక్ పెద్ద దొంగ అని, మాన్సాస్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని మాట్లాడారు.