కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో బీజేపీ నేతలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో ఏపీలో ఒక్కశాతం ఓట్లు రాకపోయిన సరే, తామే జగన్కు అసలైన ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదట్లో వరుసపెట్టి టీడీపీ నేతలకు కాషాయ కండువా కప్పుతూ, ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ స్థానంలోకి బీజేపీ వస్తుందని ప్రకటించేశారు.