తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఉంటున్న యనమల రామకృష్ణుడు...వరుసపెట్టి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో పూర్తిగా ఫాలోయింగ్ కోల్పోయిన యనమల నిత్యం ఏదొక అంశంలో జగన్ని టార్గెట్ చేసే మాట్లాడుతున్నారు. తాజాగా కూడా జగన్ అక్రమ ఆస్తులని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని మాట్లాడారు. ఎప్పటిలాగానే 43 వేల కోట్లని ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. రూ. 43 వేల కోట్ల జగన్ అవినీతి సంపద ప్రజాపరం చేయాలని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు.