కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కీలకమైన జిల్లా. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈ జిల్లాలో పుంజుకోవడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కంచుకోటలని మళ్ళీ గెలుచుకోవాలని టీడీపీ నేతలు బాగానే కష్టపడుతున్నారు. అయితే అందరు నేతలు కష్టపడితే తర్వాత మంచి ఫలితం వస్తుంది. కానీ జిల్లాలో సగంపైనే నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్‌గా లేరు. దీని వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ వీక్‌గా కనిపిస్తోంది. పైగా అక్కడ అధికార వైసీపీ ఎమ్మెల్యేల డామినేషన్ ఎక్కువగా ఉండటం వల్ల టీడీపీకి ఛాన్స్ రావడం లేదు.