ముద్రగడ పద్మనాభం....కాపు ఉద్యమ నాయకుడు. గత కొన్నేళ్లుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న నేత. గతంలో టీడీపీలో రాజకీయాలు చేసిన ముద్రగడ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. అప్పటినుంచి కాపులని బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు ముద్రగడ ఏ స్థాయిలో ఉద్యమం చేశారో అందరికీ తెలిసిందే.