పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిన ప్రతిసారీ అందరూ కేంద్రాన్నే తప్పుబడతారు. కేంద్రం రెట్లు పెంచి ప్రజలపై భారం మోపుతోందని అంటారు. అయితే రేట్లు పెరిగిన ప్రతిసారీ పన్నుల రూపంలో రాష్ట్రాలకు కూడా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని రాష్ట్రాలు జేబులో వేసుకుంటాయి, పరోక్షంగా కేంద్రంపై విమర్శలు మొదలు పెడతాయి. అయితే ఈసారి కేంద్రం పెట్రో రేట్ల పాపాన్ని రాష్ట్రాల నెత్తిన పెట్టేందుకు సిద్ధమైంది. ఆ దిశగా ప్రధాని మోదీ సహా ఇతర మంత్రి వర్గం, బీజేపీ నేతలు ముందుగానే హింట్లిస్తున్నారు.