ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇటీవల ఏపీ, ఒకరోజు వ్యాక్సినేషన్ విషయంలో తన రికార్డు తానే బద్దలు కొట్టింది, కొత్త రికార్డు సృష్టించింది. అయితే తెలంగాణ మాత్రం వివిధ వర్గాల వారికి ప్రత్యేకంగా వ్యాక్సిన్లు వేయిస్తూ భరోసా కల్పిస్తోంది. లాక్ డౌన్ పీరియడ్ లో ఆర్టీసీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు వేయించారు. ఇప్పుడు ఉపాధ్యాయులకు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఏపీలో ప్రస్తుతానికి అలాంటి ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.