దాదాపుగా రెండు ఏళ్ల నుండి దేశవ్యాప్తంగా కరోనా కెరటాల తాకిడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. కాగా ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది, రికవరీ రేటు గణనీయంగా పెరిగింది. అయితే ఓ వైపు థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న ప్రమాదం పొంచి ఉంటే, మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.