తెలంగాణా వెనుకబాటు తనానికి కారణం వైఎస్ఆర్ అని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబందం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని మంత్రి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇస్తానని మభ్యపెట్టి..అధికారం వచ్చాక యూ టర్న్ తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్ర ప్రజలపై మాకు కోపం లేదని..ఆంధ్రలో లేనట్టుగా తెలంగాణలో అభివృద్ధి, పరిస్థితులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.