ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షలని రద్దు చేశాయి. ఆఖరికి కేంద్ర పరిధిలో ఉండే పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపించింది. ఎప్పటికప్పుడు పరీక్షలని వాయిదా వేసుకుంటూ వచ్చింది గానీ, రద్దు వైపు మొగ్గుచూపలేదు. అయితే పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ గట్టిగానే డిమాండ్ చేశారు.