నేడు రాజన్నసిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాలలో షర్మిల పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా షర్మిల కరోనా తో చనిపోయిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీధర్ గతంలో వైసీపీలో పనిచేశారు. అంతే కాకుండా షర్మిల తన పర్యటనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను పరామర్శించి,ఆర్ధిక సాయం చేయనున్నారు. ఇక రాజన్నసిరిసిల్ల జిల్లాలో మీడియాతో మాట్లాడిన షర్మిల కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు.