ఏపీ రాజకీయాలు ఎక్కువగా అగ్రకులాలు చెప్పినట్లే నడుస్తాయనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా కమ్మ, రెడ్డి వర్గాలు రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు వర్గాల నాయకులే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని, ప్రతిపక్షంలో టీడీపీని నడిపిస్తున్నారు. కమ్మ వర్గానికి చెందిన చంద్రబాబు టీడీపీకి అధ్యక్షుడుగా ఉంటే, రెడ్డి వర్గానికి చెందిన జగన్ వైసీపీకి అధినాయకుడుగా ఉన్నారు.