కాంగ్రెస్, బీజేపీ... జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న బడా పార్టీలు ప్రస్తుతం బీజేపీదే పైచేయి అయినా, కాంగ్రెస్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ పార్టీ ఏ క్షణాన్నైనా పుంజుకునే అవకాశముంది. అలా జాతీయ స్థాయిలో పేరొందిన కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో మాత్రం సత్తా చాటలేకపోతున్నాయి. రాష్ట్ర విభజన ముందు వరకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రాష్ర్ట విభజన చేసిందో అప్పటినుంచి, ఏపీలో కాంగ్రెస్ పని ఖతం అయింది.