ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? అంటే అబ్బో అంత గొప్పగా ఏమి లేదనే సమాధానం వస్తుంది. ఎమ్మెల్యేలు గెలిచి రెండేళ్ళు అయిపోయింది. ఈ రెండేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడే ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం బాగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పనితీరు సరిగా లేకపోయినా సరే ఎమ్మెల్యేలు ఇంకా స్ట్రాంగ్‌గా కనిపించడానికి కారణం జగన్ ఇమేజ్ అని అంటున్నారు.