చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం రాజకీయాలు ఎవరికి అర్ధం కావడం లేదు. కరణం వైసీపీ వైపునే ఉన్నా సరే, ఆ పార్టీ కార్యకర్తలకు పూర్తి నమ్మకం రావడం లేదు. ఇంతవరకు ఆయన వైసీపీ తరుపున పెద్దగా కార్యక్రమాలు కూడా చేయ లేదు. అయితే దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసిన కరణంకు...ఇంకా ఆ పార్టీ పట్ల సానుభూతితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ళు టీడీపీలో పనిచేసిన కరణం గత ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.