హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే అన్నట్టుంది. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో సీఎం కేసీఆర్ తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అయినా, ఆయన సతీమణిని పోటీలో దింపినా టీఆర్ఎస్ తో టఫ్ పైట్ మాత్రం గ్యారెంటీ. అధికార టీఆర్ఎస్ ఆ స్థానం కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. రాగా పోగా కాంగ్రెస్ మాత్రమే ఆటలో అరటిపండులా మిగిలిపోతోంది. గతంలో హుజూరాబాద్ లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు అనివార్యంగా మూడో స్థానానికి పడిపోవడం మినహా చేయగలిగిందేమీ లేదు.