ఆదివారం దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేసీఆర్ ప్రగతి భవన్ లో వారితో కలిసి కూర్చుని భోజనం చేయనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత మొదలయ్యే ఈ సమావేశం రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగుతుందని సీఎంవో కార్యాలయం తెలిపింది. మరి ఇన్నాళ్లకు తమపై కేసీఆర్ కురిపిస్తున్న ప్రేమ పట్ల దళిత నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.