హుజూరాబాద్‌లో గెలవాలంటే.. అక్కడి పరిస్థితి కూలంకషంగా అంచనా వేయాలి.. అక్కడి జనం ఏమనుకుంటున్నారు.. వారు కేసీఆర్ పాలన పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నారు.. స్థానికంగా ఈటల బలం ఎంత.. స్థానికంగా ఈటలపై జనం ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు.. ఈ విషయాలన్నీ సరిగ్గా తెలిస్తేనే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలో తెలుస్తుంది. అందుకే కేసీఆర్ హుజూరాబాద్‌లో ఇంటలిజెన్స్ బలగాలను మోహరించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.