పశ్చిమ గోదావరి జిల్లా...మొదట నుంచి టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లా. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు వెస్ట్‌లో సైకిల్ చిత్తు అయింది. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం రెండు చొట్లే గెలుచుకుంది. ఇక వైసీపీ 13 చోట్ల సత్తా చాటింది.