ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు ఇంకా హాట్ టాపిక్‌గానే ఉన్నారు. సొంత పార్టీ, ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న రఘురామకు వైసీపీ చెక్ పెట్టలేకపోతున్నట్లే కనిపిస్తోంది. ఒకసారి చెక్ పెడదామనుకుని చిక్కుల్లో పడింది. రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసినా కూడా రఘురామ వెనక్కి తగ్గట్లేదు. బెయిల్ మీద బయటకొచ్చాక ఆయన, వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేశారో రాష్ట్రమే కాదు దేశమంతా చూసింది.