చంద్రబాబు...వచ్చే ఎన్నికలని సింగిల్గానే ఎదురుకుంటారా? అంటే అబ్బే అసలు చెప్పలేమనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 2019 ఎన్నికల మినహా మిగతా ఎన్నికల్లో బాబు ఎప్పుడు ఒంటరిగా బరిలో దిగలేదు. ఎప్పుడు ఏదొక పార్టీతో కలిసే పోటీ చేశారు. కానీ 2019లో అనూహ్యంగా టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో బాబు ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకునే ముందుకెళ్తారనే చెప్పొచ్చు.