ఏపీలో విద్యారంగంలో ఖర్చు చేసేందుకు ఏకంగా 250 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 1,860 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు ముందుకొచ్చింది. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం.