భారత్ లో వీఐపీలు రోడ్లపైకి వచ్చారంటే బుగ్గకార్ల వరస మొదలవుతుంది. వారికోసం అరగంట ముందు నుంచీ రోడ్లన్నీ ఖాళీగా వదిలిపెడతారు పోలీసులు. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిందే. అర్జంట్ పనిపై బయటకు వెళ్లేవారు, అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లేవారు.. ఎవరైనా దారిలో ఆగిపోవాల్సిందే. సదరు వీఐపీ, ఆయన మందీ మార్బలం కార్లన్నీ వెళ్లిన తర్వాతే సామాన్య ప్రజలు ముందుకెళ్లాల్సి ఉంటుంది. సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ సూక్తులు ఇక్కడ కనిపించవు, వినిపించవు.