ట్విట్టర్ వైఖరిని ఎండగడుతూ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ట్విట్టర్లోనే ట్విట్టర్‌పై యుద్ధం ప్రకటించారు. వరుసగా ట్వీట్లు పెడుతూ కలకలం సృష్టించారు. కొత్త ఐటీ చట్టాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మరి కేంద్రం హెచ్చరికలకు ట్విట్టర్ లొంగుతుందా.. కేంద్రం ట్విట్టర్‌ను నిషేధించే సాహసం చేస్తుందా.. ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్నది వేచి చూడాలి.