తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాష్ట్రంలోని అన్ని పార్టీల దళిత ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది. ఇక ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ....భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందని....మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలన్నారు. గోరేటి వెంకన్న.. గల్లీ చిన్నది.. పాటను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు.