ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజులు.. రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి వాకబ్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవికి ఫోన్ చేసి ఆరా తీశారు. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేఖంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఠాగూర్ హెచ్చరించారు.