థర్డ్ వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సహజంగా పిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అరికట్టేందుకు ఇచ్చే 'న్యుమోకోకల్' వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యాక్సిన్ ను ఏడాదిలోపు వయసున్న పిల్లలకు రెండు మూడు సార్లు వేస్తారని చెబుతున్నారు వైద్య నిపుణులు. కరోనాతో దీనికి సంబంధం లేకపోయినా థర్డ్ వేవ్ ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.