తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తొలిరోజునుంచీ రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తానని చెబుతూనే వైరిపక్షాలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీని ఒకే గాటన కట్టేస్తూ రెండిటినీ ఇరుకున పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతానంటే కొంతమంది సీనియర్లు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఏ హోదాలో, తమ ప్రాంతంలో యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడాయన పీసీసీ అధ్యక్షుడిహోదాలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్ని పునరేకీకరణ చేస్తామంటున్నారు.