గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా సరే ఏపీలో మాత్రం బీజేపీ బాగా హడావిడి చేస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీలో పుంజుకోవాలని బీజేపీ బాగా ప్రయత్నిస్తుంది. మొదట్లో కొంతమంది టీడీపీ నేతలని పార్టీలో చేర్చుకుని, అసలు టీడీపీ పని అయిపోయింది..తామే జగన్కు ప్రత్యామ్నాయమని అన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ చెప్పేసింది.