బీకే పార్థసారథి....టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా. అనంతపురం జిల్లాలో టీడీపీకి కీలక నాయకుడు. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టడంలోనూ ఆయన దిట్ట అనే పేరు తెచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు హిందూపురం పార్లమెంటరీ పార్టీ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బీకే.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ టీడీపీ పరిధిలోనే ఉన్నా.. పార్లమెంటు మాత్రం వైసీపీ పరిధిలోనే ఉంది. దీంతో ఇక్కడ అధికార పార్టీ దూకుడు ఎక్కువగా ఉందనే చెప్పాలి. పైగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య.. అడపాదడపా.. వచ్చిపోతున్నారే తప్ప.. పెద్దగా పట్టించుకోవడం లేదు.