భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో కామ్రేడ్ శారదా, కామ్రేడ్ హిద్మా ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. పాలకులు ప్రభుత్వాలు కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా దృష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పోలీసులు కావాలనే హిద్మా, శారదా కారోనా వైరస్ తో చనిపోయరని ప్రచారం చేస్తున్నారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని ప్రజలు, కుటుంబ సభ్యులు నమ్మవద్దని అన్నారు.