ఏపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏపీలో బీసీల తర్వాత కాపు ఓటర్లే ఎక్కువగా ఉంటారు. వారు గెలుపోటములు డిసైడ్ చేసే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా గెలుపోటములని ప్రభావితం చేసే కాపుల్లో మంచి ఫాలోయింగ్ నాయకుడు వంగవీటి రాధా. తన తండ్రి వంగవీటి రంగా కాపుల అభివృద్ధి కోసం కృషి చేశారు. రాజకీయాల్లో సైతం రంగా తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో రంగాకు తిరుగులేదు.