థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకు ఎక్కువగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ముంబైలో మున్సిపల్ అధికారులు చేపట్టిన సర్వే ఒకటి ఆసక్తికర ఫలితాలను వెలుగులోకి తెచ్చింది. ఈ సర్వేలో ముంబైలోని పిల్లల్లో దాదాపు 51శాతం మందిలో కరోనా వైరస్ ని ఎదుర్కునే యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. అంటే ఆ 51శాతం మంది పిల్లలు గతంలో కరోనా ప్రభావానికి గురయ్యారనే లెక్క. కరోనా వైరస్ సోకడం వల్లే వారి శరీరంలో దాన్ని తట్టుకునే యాంటీబాడీలు డెవలప్ అయ్యాయి. అయితే వీరిలో చాలామందికి కొవిడ్ లక్షణాలే లేవు. అన్నీ అసింప్టమాటిక్ కేసులే. అంటే థర్డ్ వేవ్ కంటే ముందే సెకండ్ వేవ్, చిన్నారులను కరోనాకి గురి చేయడంతో వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యాయి. ఈ యాంటీబాడీలు శరీరంలో ఉన్నన్ని రోజులు.. కొవిడ్ వైరస్ ని సమర్థంగా వారు ఎదుర్కోగలరు.