వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ ని ఉత్పత్తి చేసి చైనా బయోవార్ కి తెరతీసిందనే ఆరోపణలు ఇంకా వినిపిస్తునే ఉన్నాయి. సరిహద్దులు మూసేసుకున్నా ఈ వైరస్ ని అడ్డుకోవడం సాధ్యం కాదని అన్ని దేశాలకు తెలిసొచ్చింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఇలా వైరస్ తో యుద్ధం కొనసాగుతూనే ఉంది. బయోవార్ అనేది నిజమేనా లేక ఊహాజనితమా అనే విషయాన్ని పక్కనపెడితే.. కొత్తగా భారత్ డ్రోన్ వార్ తో సతమతం అవుతోంది. శత్రువు కనిపించకుండా చేసే యుద్ధమే డ్రోన్ వార్.