చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి సీఎం జగన్పై ఏ రకంగా ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదొక అంశంపై బాబు, జగన్ని విమర్శిస్తున్నారు. అలాగే తమ నేతలపై కేసులు పెట్టి హింసిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని పదే పదే చెబుతున్నారు. అలాగే అప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కేసులు పెట్టి ఉంటే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డుపైకి వచ్చేవారు కాదని మాట్లాడుతున్నారు.