అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని గాడిలో పెట్టుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆయన ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు ఆయనకు సహకరించి.. పార్టీని క్రమంగా పుంజుకునేలా చేయాల్సిన వారు.. ఇప్పుడు ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లాలోని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ లిస్టులో విజయవాడ వెస్ట్, పామర్రు, తిరువూరు, అవనిగడ్డ, గన్నవరం లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి.