గత కొన్నిరోజులుగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చుట్టూ రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ మళ్ళీ బాధ్యతలు చేపట్టడంతో, వైసీపీ నేతలు ఆయనపై రాజకీయంగా దాడి చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఎలాగైనా అశోక్‌ని ఛైర్మన్ పీఠం నుంచి దించేస్తామని, ఆయనొక దొంగ అని, మాన్సాస్ భూములు కాజేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు.