ఏ పార్టీ అయినా కొత్తగా అధికారంలోకి వస్తే ముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు గతంలో వైఎస్సార్.. ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీలని ప్రవేశ పెట్టారు. ఈ రెండిటిని అటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాలు గతంలో కొనసాగించాయి.