తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దూకుడుగా రాజకీయాలు మొదలుపెట్టారు. మొదట అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లని బుజ్జగించే పనిలో పడ్డారు. అలాగే వరుసపెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని కలుస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి రేవంత్ సొంత వ్యూహాలతో ముందుకెళ్లనున్నారని తెలిసింది. మొన్నటివరకు రేవంత్‌కు కొన్ని వ్యూహాలు ఉన్నా సరే, కాంగ్రెస్ సీనియర్ల మధ్య అమలు చేయడం కుదరలేదు.