తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ ఓడిపోలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలుస్తూనే వస్తుంది. అది టీడీపీ తరుపున వేగుళ్ళ జోగేశ్వరరావు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక్కడ పార్టీ బలంతో పాటు, సొంత ఇమేజ్ ఉండటంతో వేగుళ్ళ గెలుస్తూ వస్తున్నారు. ఈయన ప్రజలతోనే ఉండటమే ప్లస్ అవుతుంది.