ప్రైవేట్ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్ డోసుల నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఓ లేఖ రాశారు.