వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. వైఎస్ఆర్ ని అభిమానించేవారు, ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా షర్మల పార్టీవైపు చూస్తారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఎన్నికలకింకా రెండేళ్లకు పైగా సమయం ఉండటంతో ఎవరూ తొందరపడి షర్మిల వైపు వెళ్లలేదు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కల్లోలం మొదలైంది. దీంతో ముందుగానే వారంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధంతో, ఆయన కుమార్తె షర్మిల పెట్టిన పార్టీలోకి వెళ్తారని చెబుతున్నారు.