ఏపి ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఉదయం 10:25 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద నున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కుడివైపు కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ద్వారా ఈ పనులు పూర్తి చేస్తారు. మొత్తంగా 15.525 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ చేయనున్నారు.