సోనియాగాంధీ తెలంగాణ దేవత కాదు, ఎంతోమందిని బలి తీసుకున్న బలిదేవత అంటూ గతంలో టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఈ వీడియోలు పెద్దగా బయటకు రాలేదు కానీ, ఇప్పుడు ఏకంగా పీసీసీ పీఠం ఇచ్చే సరికి ఆయన వైరి వర్గం ఆయా వీడియోలను సర్కులేట్ చేస్తోంది. సోనియాను బలిదేవత అన్న అదే నోటితో ఇప్పుడు రేవంత్ ఆమెను పొడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ బలిదేవత దయాదాక్షిణ్యాలతోనే రేవంత్ పీసీసీ పీఠం చేరుకున్నారని అంటున్నారు పార్టీలో ఆయన వ్యతిరేకులు.