ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని జనసేన గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆయనపై నిత్యం ఏదొకరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేన నాయకుడు పోతిన మహేష్..వెల్లంపల్లిపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు. దేవాదాయ శాఖలో వెల్లంపల్లి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటు డబ్బులు తీసుకుని మరీ వెల్లంపల్లి దేవాలయాల్లో ఇటీవల పారిశుధ్య కార్మికులని నియమించారని జనసేన విమర్శలు చేస్తుంది.