తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా కొండపి ఒకటి. ఇక్కడ ఎక్కువసార్లు తెలుగుదేశమే గెలుస్తూ వచ్చింది. ఇక గత రెండు పర్యాయాలుగా ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తుంది. టీడీపీ తరుపున డోలా బాల వీరాంజనేయస్వామి గెలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈయన జూపూడి ప్రభాకర్ రావుపై గెలవగా, 2019 ఎన్నికల్లో మాదసి వెంకయ్యపై గెలిచారు.