నీతి అయోగ్ జాబితాలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి గుర్తింపు వచ్చింది. ప్రముఖ నటుడు, దివంగత నందమూరి తారకరామారావు ఆయన సతీమణి పేరిట హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎటువంటి లాభాపేక్ష లేకుండా చికిత్సాలయంగా బసవతారకం గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా లాభాపేక్ష లేని ఆస్పత్రిగా నీతి అయోగ్ జాబితాలో బసవతారకం ఆస్పత్రి చేర్చింది. ఇక ఇదే నివేదికలో పుట్టపర్తి వైద్యాలయానికి కూడా గుర్తింపు దక్కింది.