నిన్న మొన్నటి వరకు పార్టీ అవకాశం ఇవ్వలేదు.. అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫుల్లుగా రెచ్చిపోమని.. పార్టీ నుంచి ఆదేశాలు అందినా..కూడా ఆ నేత స్పందించడం లేదని అంటున్నారు కార్యకర్తలు. ఆయనే చిత్తూరు జిల్లాకు చెందిన నగరి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్.. గాలి భాను ప్రకాశ్ నాయుడు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. తర్వాత కొన్నాళ్లు పార్టీ నుంచి కార్యక్రమాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. భాను దూకుడుగా లేడని.. ఆయన వల్ల పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదని.. దీంతో ఇక్కడ నేతను మార్చాల్సిన అవసరం ఉందని.. పార్టీలో చర్చవచ్చింది.