కేసీఆర్ , కేటీఆర్ లు ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆధారాలతో అన్ని బయట పెడుతానని అన్నారు. కేసీఆర్ కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు మరోసారి ప్రజల కోసం ఎందుకు వెళ్లొద్దొంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పోవాలి అంటే ఎన్నికలు రావాలని అన్నారు.